నా టాలెంట్ నిరూపించుకునే కథ ‘అమృతంగమయ’ – వల్లభ

నా టాలెంట్ నిరూపించుకునే కథ ‘అమృతంగమయ’ – వల్లభ

Published on Oct 13, 2013 8:00 PM IST

Alekjandar-Vallabha
అభిలాష, చాలెంజ్, చంటి, మాతృదేవోభవ, వాసు, దమ్ము లాంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత కెఎస్ రామారావు. ఇప్పడు ఆయన తన క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థలో మరో సినిమా చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకి ‘అమృతంగమయ’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాకి తన కుమారుడు అలెగ్జాండర్ వల్లభ దర్శకుడిగా మారనున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు విజయదశమి సందర్భంగా ఈ రోజు మొదలయ్యాయి.

ఈ సందర్భంగా అలెగ్జాండర్ వల్లభ మాట్లాడుతూ ‘మొదట నన్ను నటుడిగా మార్చి, ఆ తర్వాత నిర్మాతగా, ఇప్పుడు దర్శకుడిగా అవకాశమిచ్చిన మా నాన్న గారికి కృతఙ్ఞతలు. నటుడిగా మొదట పరిచయమైన నేను ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నటనకు దూరమయ్యాను. ఇప్పుడు నా టాలెంట్ నిరూపించుకోగల స్టొరీ దొరకడంతో దర్శకుడిగా మారుతున్నానని’ అన్నాడు. ఈ సినిమాకి సంబదించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

తాజా వార్తలు