విక్టరీ వెంకటేష్ మరియు రామ్ కలిసి నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘మసాలా’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. మామోలు సినిమాలలా కాకుండా ఈ చిత్రంలో వెంకీ బాడీలాంగ్వేజ్ మరియు డైలాగు డెలివరీ కొత్తగా వున్నాయి. రామ్ ఎనేర్జేటిక్ నటన మరియు వన్ లినెర్స్ ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకు డైలాగులను అనీల్ రవిపూడి అందించారు. ఇతను గతంలో ‘కందిరీగ’ సినిమాకు ఇప్పుడు శ్రీను వైట్లతో కలిసి ‘ఆగడు’ సినిమాకు తన కలాన్ని కదిపారు. ఈ సినిమా యొక్క ఆడియో మరియు మేకింగ్ వీడియో ఈ వారంలో విడుధలకావచ్చు. అక్టోబర్ లో ఈ చిత్రం మనముందుకు రానుంది.
విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్రవంతి రవి కిషోర్ మరియు డి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ‘బోల్ బచ్చన్’ కు రీమేక్.