నాకు చాలెంజింగ్ రోల్స్ అంటేనే ఇష్టం : శృతి

నాకు చాలెంజింగ్ రోల్స్ అంటేనే ఇష్టం : శృతి

Published on Oct 11, 2013 11:15 AM IST

Shruthi-Hasan
తన కెరీర్ మొదట్లో ముందుగా శృతిహాసన్ నటనను అందరూ వేలెత్తి చూపించారు. కెరీర్ ప్రారంభంలో ఆమెఎదురుకున్న చేదు నుభావాలు ఇందుకు నిదర్శనం.కాకపొతే ‘గబ్బర్ సింగ్ ‘ ఘన విజయం తరువాత ఆమె ఇంక వెనుతిరిగి చూడనవసరం లేదు

ఆమెకు ఈ యేడు సువర్ణ సమయంగా అభివర్ణించచ్చు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో గెస్ట్ రోల్ చేసినందుకు చాలా మంది ఆశ్చర్యపోతున్న తరుణంలో ‘నాకు చాలెంజింగ్ గా అనిపించినా పాత్రలను చేస్తాను. వాటి నిడివి గురించి పట్టించుకోను. ఈ సినిమాలో అతిధి పాత్రకు కారణం ‘అమ్ములు’ పాత్ర చిత్రీకరణ మరియు ప్రేక్షకునిపై ఆ పాత్ర చేసే ప్రభావం’ అని తెలిపింది

ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలలో శృతి నటించిన తీరుకు ప్రేక్షకులనుండి ప్రశంసలను పొందుతుంది

తాజా వార్తలు