తమిళ ప్రేక్షకులతో పాటూ అతని అనువాద చిత్రాలతో అంతే మోతాదులో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్న హీరోలలో సూర్య ఒకరు. అతని సినిమాల అనువాదానికి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. సూర్య నటించిన ఆఖరి అనువాద చిత్రం ‘సింగం 2’
ఈ ‘సింగం 2’ తరువాత సూర్య ‘ధృవ నక్షత్రం’ అనే సినిమాలో నటించాల్సివుంది. ఈ సినిమాకు గౌతం మీనన్ దర్శకుడు. పూజా కార్యక్రమాలు కూడా మొదలైన ఈ సినిమానుండి తప్పుకుంటున్నట్లు సూర్య తెలిపాడు . ఈ సినిమాకు సంబంధించిన పక్కా స్క్రిప్ట్ అనేదిలేకుండా గౌతం మీనన్ ఆరు నెలలుగా తన డేట్స్ అన్నీ వృధా చేస్తున్నాడని, అందుకే సినిమా నుండి బయటకు వచ్చేస్తున్నట్లు తెలిపాడు
గతంలో ఇలాంటి సంఘటనే గౌతం తో ఎదురైందని, ”చెన్నై ఒరు మజైకాలం
అనే సినిమాపై 8 నెలలు వృధా చేసాడని, దాని ఫలితం సున్యం అని చెప్పుకొచ్చాడు మన గజినీ