నా గత చిత్రాలు చూస్తే నాకే భాదవేస్తుంది: కాజల్

నా గత చిత్రాలు చూస్తే నాకే భాదవేస్తుంది: కాజల్

Published on Oct 11, 2013 11:00 AM IST

Kajal
తెలుగు మరియు తమిళ చిత్రాలతో బిజీ తారగా వెలుగుతూ పెద్ద పెద్ద సినిమాలలో కాజల్ తన కెరీర్ ను కొనసాగిస్తుంది. ‘సింగం’ సినిమాతో బాలీవుడ్ లో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ కూడా మంచి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. కాజల్ ‘బాద్ షా’ సినిమా తరువాత మరే తెలుగు సినిమానూ అంగీకరించలేదు. ఆమె గత చిత్రాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ”నేను యాక్టర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు . ఎక్కడా శిక్షణ కూడా తీసుకోలేదు. ఇప్పుడు నా గత సినిమాలలో నా నటన చూస్తే నా మీద నాకే సిగ్గుతో కూడిన బాధవేస్తుంది. ప్రతీ సినిమాలో ఎంతోకొంత నటనను మెరుగుపరుచుకున్నాను. ప్రస్తుతం నా నటనపై నాకు విశ్వాసం కలిగిందని’ తెలిపింది. నటన అనేది ఒక సాగరంలాంటిదని, తన చివరి సినిమావరకూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే వుంటానని కూడా తెలిపింది

తాజా వార్తలు