యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా అక్టోబర్ లో థియేటర్స్ లో సందడి చేయనుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం జరుగుతోంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆల్బంకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఎన్.టి.ఆర్ – సమంత హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కి హరీష్ శంకర్ డైరెక్టర్. దిల్ రాజు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో శృతి హాసన్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో ఇది వరకు చూపించని విధంగా ఉన్న ఎన్.టి.ఆర్ లుక్ అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంది. ఈ చిత్ర ట్రైలర్ అభిమానులకి విపరీతంగా నచ్చేయడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలను ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ ఎంతవరకు రీచ్ అవుతారు అనే దానికోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..