ఈ వారమే రానున్న పవన్ అత్తారింటికి దారేది

ఈ వారమే రానున్న పవన్ అత్తారింటికి దారేది

Published on Sep 23, 2013 5:50 PM IST

Attarintiki-Daredi-Posters-
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఈ శుక్రవారం అనగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర యూనిట్ ని ఈ రోజు ఉదయం ఓ విషయం తెలిసి షాక్ కి గురయ్యారు. విషయం ఏమిటంటే ఈ సినిమాలోని 90 నిమిషాల పార్ట్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది.

ఈ విషయం తెలుసుకున్న ఈ చిత్ర యూనిట్ సినిమాని ఉన్నపాటుగా రిలీజ్ చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడంతో ఈ శుక్రవారం సినిమా థియేటర్స్ కి రానుంది. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

అభిమానులు మరియు సినీ అభిమానులు అందరూ పైరేట్ సిడీలకు దూరంగా ఉండండి. వాటిని చూడకండి, సినిమాని థియేటర్లోనే చూద్దాం.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడండి.. పవన్ ‘అత్తారింటికి దారేది’ ని కాపాడండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు