అక్టోబర్ 16న మహేష్ బాబు ‘ఆగడు’ ముహూర్తం

అక్టోబర్ 16న మహేష్ బాబు ‘ఆగడు’ ముహూర్తం

Published on Sep 19, 2013 3:10 PM IST

Sreenu-vaitla-and-Mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా ‘ఆగడు’. ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు అక్టోబర్ 16న హైదరాబాద్ జరగనున్నాయి. ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతోందని సమాచారం. మహేష్ బాబు. శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ ను సాదించింది. ఈ ‘దూకుడు’ సినిమాని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారే ఈ ‘ఆగడు’ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు ‘1- నేనొక్కడినే’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు