బాలయ్య – బోయపాటి మూవీ టైటిల్ ‘లెజెండ్’?

బాలయ్య – బోయపాటి మూవీ టైటిల్ ‘లెజెండ్’?

Published on Sep 19, 2013 3:02 PM IST

Balakrishna
నందమూరి ఫ్యాన్స్ కి మేము ఒక ఆసక్తికరమైన విషయాన్ని అందిస్తున్నాం. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి ‘లెజెండ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ చిత్ర మేకర్స్ కూడా ఈ టైటిల్ కి సముఖతగా ఉన్నట్లు, అలాగే ఈ సినిమా కథకి, అందులోని బాలకృష్ణ పాత్రకి ఆ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని వారు భావిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా లోని కొన్ని ఫైట్ సీక్వెన్స్ లను ఇటీవలే షూట్ చేసారు. నిన్ననే ఈ సినిమాలో బాలకృష్ణ కోసం ఓ స్పెషల్ బైక్ ని రెడీ చేస్తున్నారని మీకు తెలిపాము. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. వారాహి చలన చిత్ర బ్యానర్ తో కలిసి 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు