మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ప్రియాంక చోప్రా జంటగా నటించిన సినిమా ‘జంజీర్’. ఈ సినిమాని తెలుగులో ‘తుఫాన్’ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్న సంగతి మనకు తెలిసిందే.. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాని హిందీ మరియు తెలుగు భాషల్లో కలిపి సుమారు 3500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అపూర్వ లఖియా ఈ సినిమాకి డైరెక్టర్.
సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాలో శ్రీ హరి షేర్ ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ – పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమీత్ ప్రకాష్ మెహ్రా – ఫ్లైయింగ్ టర్టల్ ఫిల్మ్స్ వారు కలిసి నిర్మించారు. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ కి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని హై కోర్టు ఆర్డర్ ఇవ్వడం మరియు ఇప్పటికే బాలీవుడ్ టాప్ విమర్శకుల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో అభిమానులు ఈ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.