చివరి దశలో ఉన్న ‘బసంతి’

చివరి దశలో ఉన్న ‘బసంతి’

Published on Sep 5, 2013 8:15 AM IST

Basanti
కామెడీ కింగ్ బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బసంతి’. మొదటి ప్రయత్నంగా ‘బాణం’ సినిమా తీసి విమర్శకుల ప్రశంశలు అందుకున్న చైతన్య దంతులూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాకి ‘ఎ లవ్ స్టొరీ బిట్వీన్ ఎ కైట్ అండ్ ఎ ఫ్లైట్’ అనేది ట్యాగ్ లైన్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ద్వారా నూతన తార హీరోయిన్ పరిచయం కానుంది.

గతంలో ‘పల్లకిలో పెళ్లి కూతురు’, ‘వారెవా’ సినిమాలు చేసి బాక్స్ ఆఫీసు వద్ద విజయం అందుకోలేకపోయిన గౌతమ్, అలాగే మొదటి సినిమాతో విమర్శకులను మాత్రమే మెప్పించిన చైతన్య దంతులూరి ఈ సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అనీల్ భండారి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.

తాజా వార్తలు