హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాంబినేషన్లో సుమంత్ మూవీ

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాంబినేషన్లో సుమంత్ మూవీ

Published on Aug 26, 2013 8:41 AM IST

sumanth-new-movie

అక్కినే ఫ్యామిలీ సుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సుమంత్. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన సుమంత్ ఇప్పుడు సినిమాలు చేయడంలో కాస్త వెనుకబడ్డాడు. బాగా గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తున్న సుమంత్ మరో కొత్త సినిమాకి సైన్ చేసాడు. సుమంత్ కెరీర్లో కమర్షియల్ గా రెండవ హిట్ ఇచ్చిన సినిమా ‘గౌరి’. ఈ సినిమా డైరెక్టర్ బివి రమణ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో వీరిద్దరూ మరో హిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం సుమంత్ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాలో నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. థాయ్ నటి పింకీ సావికా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానున్న ఈ మూవీకి చంద్ర సిద్దార్థ్ డైరెక్టర్.

తాజా వార్తలు