టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఒకటి. గతంలో ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అదే ప్రొడక్షన్ అధినేత దాగ్గుబాటి వంశం నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన రానా ఇప్పటి వరకు తన సొంత బ్యానర్ లో మాత్రం సినిమా చెయ్యలేదు. ఇటీవలే జరిగిన ఓ ఆడియో ఫంక్షన్ లో తన సొంత బ్యానర్ లో సినిమా చెయ్యాలని ఉందని తెలిపాడు. రానా మాట్లాడుతూ ‘ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండియన్ సినిమాలో సురేష్ ప్రొడక్షన్స్ కి ప్రత్యెక స్థానం దక్కింది. చెప్పాలంటే ఈ నిర్మాణ సంస్థని స్థాపించి 49 సంవత్సరాలయ్యింది. ఒక్క నేను తప్ప ప్రస్తుతం ఉన్న చాలా స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ ఈ సంస్థలో పనిచేసారు. త్వరలోనే సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చెయ్యాలనుకుంటున్నానని’ అన్నాడు.
రానా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందే బాషలలో పలు సినిమాల్లో నటిస్తున్నాడు. అవి కాకుండా రాజమౌళితో చేస్తున్న ‘బాహుబలి’ కి ఎక్కువ డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత తన సొంత బ్యానర్ లో సినిమాని ఆశించవచ్చు.