నూతన వధూవరులతో తిరుమలేశుని దర్శించుకున్న బాలయ్య

నూతన వధూవరులతో తిరుమలేశుని దర్శించుకున్న బాలయ్య

Published on Aug 23, 2013 9:12 AM IST

Balakrishna-Daughters-Weddi
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని వివాహ మహోత్సవం ఈ నెల 21న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది ప్రముఖులు హాజరైన ఈ వివాహ మహోత్సవం తరువాత బాలయ్య కుటుంబ సభ్యులు అన్ని రకాల సాంప్రదాయబద్దమైన కార్యక్రమాలను పూర్తి చేసారు. ఈ రోజు ఉదయం బాలకృష్ణ నూతన వధూవరులతో కలిసి తిరుమలేషుని అభిషేక సేవలో పాల్గొని తిరుమలేశుని దర్శించుకున్నారు. భారీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ అక్కడి ప్రజలకి బాలయ్య వచ్చాడని తెలియడంతో టెంపుల్ కాంప్లెక్స్ దగ్గరికి అభిమానులు ఉప్పెనలా వచ్చారు.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. పెళ్ళికి సంబదించిన ఆన్ని కార్యక్రమాలు పూర్తి కాగానే ఆయన తిరిగి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారు.

తాజా వార్తలు