మరోసారి తెగ నవ్వించనున్న విష్ణు – బ్రహ్మానందం

మరోసారి తెగ నవ్వించనున్న విష్ణు – బ్రహ్మానందం

Published on Aug 23, 2013 3:50 AM IST

Vishnu---Brahmanandam
మంచు విష్ణు ప్రస్తుతం ‘దూసుకెళ్తా’ సినిమా షూటింగ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇప్పటి వరకూ తీసిన సన్నివేశాలను చూసిన కొంతమంది ‘డీ’, ‘దేనికైనా రెడీ’ సినిమాల తర్వాత మళ్ళీ ‘దూసుకెళ్తా’ లో విష్ణు – బ్రహ్మానందం కాంబినేషన్ అదిరిపోయిందని, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని, డైరెక్టర్ వీరూ పోట్ల చాలా బాగా తీసాడని చెబుతున్నారు. దీన్ని బట్టి సినిమాలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుందని తెలుస్తోంది.

మంచు విష్ణు సరసన ‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ నెలాఖరున టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు