తెలంగాణలో ఎన్.టి.ఆర్ సినిమాలు ఆడనివ్వం – ఓయు జెఏసి

తెలంగాణలో ఎన్.టి.ఆర్ సినిమాలు ఆడనివ్వం – ఓయు జెఏసి

Published on Aug 22, 2013 5:01 PM IST

Ramaiya-Vastavaiya

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ సమస్యలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’ సినిమాలు అనుకున్న తేదీ నుండి వాయిదా పడ్డాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, జూ ఎన్.టి.ఆర్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమని వారు అన్నారు.

‘ సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ రాజీనామా చేయడాన్ని ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో జూ ఎన్.టి.ఆర్ సినిమాలను ఆడనివ్వమని’ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసి సభ్యులు తెలిపారు.

జూ ఎన్.టి.ఆర్ తండ్రి గారైన హరికృష్ణ సమైక్యాంధ్రకి మద్దతుగా ఈ రోజు రాజ్యసభ ఎంపి సీటుకి రాజీనామా చేసారు. దాన్ని రాజ్యసభ చైర్మెన్ ఆమోదించారు. జూ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలంగాణలో రిలీజ్ అవుతుందా? లేదా? అనే దానికోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు