స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రేస్ గుర్రం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిన్నటి వరకు ‘ఏక్ దో రీన్ చార్’ అనే పాటకి అన్నపూర్ణ 7 ఎకర్స్ లో స్టెప్పులేసిన అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఈ రోజు నుంచి యాక్షన్ సీక్వెన్స్ లు చేయనున్నారు. నేటి నుంచి జరగనున్న యాక్షన్ ఎపిసోడ్స్ ని రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సలోని కనిపించనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి వక్కంతం వంశీ కథని అందించాడు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి నిర్మాత.