బాలయ్య సినిమాను చేయనున్న సంజయ్ దత్

బాలయ్య సినిమాను చేయనున్న సంజయ్ దత్

Published on Dec 27, 2011 1:54 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహ’ చిత్రం 2004లో సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం విదితమే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో మళ్లీ తీయబోతున్నారు. సంజయ్ దత్ హీరోగా కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. సంజయ్ దత్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా విశ్వసనీయవర్గాల సమాచారం. దీని గురించి అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. సౌత్ ఇండస్ట్రీ భారీ విజయాలు నమోదు చేస్తుండటంతో బాలీవుడ్ సౌత్ సినిమాల కోసం పరుగులు తీస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు