క్లైమాక్స్ షూటింగ్లో బిజీగా ఉన్న నితిన్ – యామి

క్లైమాక్స్ షూటింగ్లో బిజీగా ఉన్న నితిన్ – యామి

Published on Aug 12, 2013 4:20 PM IST

Nithin-Yami-gauthami
యంగ్ హీరో నితిన్ ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం నితిన్ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ రోజు ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాల్ని ఈ రోజు షూట్ చేస్తున్నారు. యామి గౌతం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబందించిన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసారు. ప్రేమ్ సాయి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఫేమస్ డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా స్టొరీ లైన్ చాలా కొత్తగా ఉంటుందని, కచ్చితంగా బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాధిస్తుందని నితిన్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

తాజా వార్తలు