తెలుగు సినిమా తప్పు దోవలో వెళ్తోంది – తేజ

తెలుగు సినిమా తప్పు దోవలో వెళ్తోంది – తేజ

Published on Aug 11, 2013 12:05 PM IST

Teja

విలక్షణ దర్శకుడు తేజ ఎవరికీ భయపడడు, ఏది అనుకుంటే అది చేసేసే ముక్కుసూటి వ్యక్తిత్వం గల వ్యక్తి. గతంలో వరుసగా బ్లాక్ బస్టర్స్ చేసిన తేజ ప్రస్తుతం వరుసగా ఫ్లాపులతో హిట్స్ లేక అల్లాడిపోతున్నాడు. తను తీసిన చివరి సినిమా ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమా పరాజయం తర్వాత త్వరలోనే ‘1000 అబద్దాలు’ సినిమాతో రానున్నాడు.

తాజాగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి కొత్త తరహాలో సినిమాలు చేయాలని ఉందని అలాగే ప్రస్తుత టాలీవుడ్ ఉన్న పరిస్థితుల గురించి చెప్పాడు. ‘ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ తప్పు దోవలో వెళుతోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలు తెరకెక్కుతున్న విధానం నాకు నచ్చడం లేదు. నేను ఆ విధానాన్ని మార్చాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాల్లో కూడా ఆలోచన కలిగించే అంశాలు ఉండేలా సినిమాలు తీయాలన్నది నా ఆశయం’ అని తేజ అన్నాడు. సాయి రామ్ శంకర్, ఎస్తర్ జంటగా నటించిన ‘1000 అబద్దాలు’ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు