‘మర్యాదరామన్న’, ‘అధినాయకుడు’, ‘బాడిగార్డ్’ వంటి సినిమాలలో నటించిన సలోని త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జతకట్టనుంది. ఈ అందాల భామ త్వరలో ‘రేస్ గుర్రం’ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాలో శృతిహాసన్ ప్రధాన హీరోయిన్.
సలోని తన కళ్ళతో, చీర కట్టుతో అభిమానుల మతిపోగొట్టగలదు. ఈ అంశాలే ఈ సినిమాలో తన పాత్రకు దోహదపడనున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నల్లమలపు బుజ్జి నిర్మాత.
కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘రేస్ గుర్రం’ ప్రస్తుతం నిర్మాణ దశలోవుంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు