బాక్స్ ఆఫీసు విజేత డబ్బింగ్ సినిమానా లేక రీమేక్ సినిమానా?

బాక్స్ ఆఫీసు విజేత డబ్బింగ్ సినిమానా లేక రీమేక్ సినిమానా?

Published on Aug 8, 2013 6:00 PM IST

anna-and-pkpm

రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుండడం వల్ల సీమాంధ్రలో చాలా చోట్ల థియేటర్లు మూతపడ్డాయి. ఆ ఎఫెక్ట్ వల్ల టాలీవుడ్ లో రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ వాయిదా పడ్డాయి. దాంతో ఇన్ని రోజులు సరైన సమయం కుదరక రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న చిన్న సినిమాలను వరుసగా ఈ సీజన్లో రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ఒకటి తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘అన్న’. రెండవది తమిళంలో విజయం సాధించిన ‘నడువుల కొంజెం పక్కత కానం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ సినిమా.

ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘అన్న’ సినిమాలో విజయ్ సరసన అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. సాజిద్ ఖురేషి డైరెక్ట్ చేసిన ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ సినిమాలో శ్రీ, సుప్రియ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ రెండిటిలో ఒకటి డబ్బింగ్ సినిమా ఒకటేమో రీమేక్ సినిమా. ఇలా ఒకేసారి వస్తున్నా రెండు తమిళ సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీసు వద్ద విజేతగా నిలుస్తుందో చూడాలి.

తాజా వార్తలు