‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాకు డబ్బింగ్ చెప్పనున్న సుమంత్

‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాకు డబ్బింగ్ చెప్పనున్న సుమంత్

Published on Aug 7, 2013 11:30 PM IST

Sumanth
సుమంత్ నటించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా ప్రస్తుతం నిర్మాణదశలోవుంది. ఈ సినిమాతో ప్రస్తుతం సుమంత్ వెండితెరపై మరోసారి తన ఉనికిని చాటుకోవాలనుకుంటున్నాడు. త్వరలో ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. ఈ సినిమాకు చంద్ర సిద్ధార్ధ్ దర్శకుడు. థాయ్ నటి పింకీ సావికా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానుంది

ఈ సినిమాకు ఎస్.ఎస్ కాంచి స్క్రిప్ట్ అందించారు. ‘అమృతం’ సీరియల్ కు పనిచేసిన ఈయన ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలలో స్క్రిప్ట్ డాక్టర్ గా మన్ననలను అందుకున్నారు. ఈ సినిమాకు పి. మదన్ కుమార్ నిర్మాత. కీరవాణి సంగీత దర్శకుడు

తాజా వార్తలు