ఊహించని విధంగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2 (Akhanda 2) వాయిదా పడిన సంగతి తెలిసిందే. మేకర్స్ తమ వల్ల అయ్యింది అంతా పెట్టి నిన్న రాత్రి నుంచి అయినా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చూసారు కానీ సినిమా మాత్రం ఆగాల్సి వచ్చింది. ఇక కొత్త రిలీజ్ డేట్స్ ఏంటి అనే చర్చ కూడా వచ్చింది. అయితే ఈ డేట్స్ లో ఓ డేట్ కి వస్తే మాత్రం టాలీవుడ్ యంగ్ హీరో బాలయ్య సినిమాతో పోటీ తప్పేలా లేదంటున్నాడు.
ఇంతకీ అఖండ 2 కి ఇతర డేట్స్ ఏంటి?
అనుకున్నట్టుగా అఖండ 2 నిన్న డిసెంబర్ 5న విడుదల అయ్యి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. కానీ పరిస్థితి తారు మారు కావడంతో ఇతర డేట్స్ గా డిసెంబర్ 12 అలాగే 25 లు ఉన్నట్టుగా వినిపిస్తుంది.
బాలయ్యతో పోటీ అనివార్యం..?
యువ హీరో ఆది సాయి కుమార్ నటించిన అవైటెడ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ ని డిసెంబర్ 25న లాక్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో దీనిపై ఎప్పుడు యాక్టీవ్ గా కనిపిస్తున్నాడు. అయితే అదే డేట్ లో అఖండ 2 వస్తే మాత్రం తాము ఆ డేట్ ని తప్పుకోలేము అని మాకు వేరే ప్లాన్స్ కూడా పెట్టుకోలేదని వినయంగా వెల్లడి చేసాడు. కానీ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దామని తెలిపాడు.
సో క్లాష్ ఉంటుందో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం తాము వెనక్కి వెళ్లే అవకాశాలు తక్కువే అని చెబుతున్నాడు. సో అఖండ 2 డేట్ ఏంటి అనేది రివీల్ కావాల్సి ఉంది.
We’ve already invested significantly in promotions, so backing out at this stage is difficult. At the moment, we’re unsure whether we’ll be able to secure enough screens simultaneously, and we don’t yet have an alternative date to postpone to. We’ll have to wait and see how… https://t.co/SMmOiJ8e2o
— Aadi Saikumar (@iamaadisaikumar) December 5, 2025


