సమీక్ష: రణవీర్ సింగ్ ‘ధురంధర్’ – గ్రిప్పింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్

సమీక్ష: రణవీర్ సింగ్ ‘ధురంధర్’ – గ్రిప్పింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్

Published on Dec 5, 2025 9:05 PM IST

Dhurandhar Review

విడుదల తేదీ : డిసెంబర్ 05, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ మరియు ఇతరులు
దర్శకుడు : ఆదిత్య ధర్
నిర్మాతలు : ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్
సంగీత దర్శకుడు : శాశ్వత్ సచ్‌దేవ్
సినిమాటోగ్రాఫర్ : వికాష్ నౌలాఖా
ఎడిటర్ : శివకుమార్ వి. పనికర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో వచ్చిన చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం “ధురంధర్” (Dhurandhar Review) కూడా ఒకటి. కేవలం హిందీలో రిలీజ్ అయ్యిన ఈ సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి. నిజ జీవిత సంఘటలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

భారత్ పై పాకిస్తాన్ జరిపిన కొన్ని ఉగ్ర దాడులు అందులో 2001 లో జరిగిన పార్లిమెంట్ అటాక్ కూడా ఒకటి. ఈ దాడుల విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యల్ (మాధవన్) పాకిస్తాన్ ఉగ్రవాదులని సమూలంగా మట్టుబెట్టాలని ఒక బోల్డ్ ప్లాన్ వేస్తారు. ఈ ప్రమాదకర ఆపరేషన్ కోసం హమ్జా ఆలీ మజారీ (రణ్వీర్ సింగ్) లా ఉండే వ్యక్తిని ఎంచుకుంటాడు. ఇక అక్కడ నుంచి ఈ సాహసోపేత మిషన్ ఎలా కొనసాగింది. ఆలీ తనకిచ్చిన పనిని పూర్తి చేశాడా లేదా? పాకిస్తాన్ ఉగ్రవాదుల అండర్ వరల్డ్ ప్రపంచానికి ఇచ్చిన సమాధానం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఇది వరకు బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు స్పై, యాక్షన్ చిత్రాలు చూసాం కానీ అవి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫిల్ అయ్యి ఉన్నవి కానీ అందుకు కొంచెం భిన్నంగా ధురంధర్ అనిపిస్తుంది అని చెప్పాలి. ఇందులో చాలా లోతుగా స్పై, థ్రిల్ మూమెంట్స్ ని మేకర్స్ ప్లాన్ చేయడం ఇంప్రెస్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్పై సినిమాల కంటే చాలా బెటర్ వెర్షన్ ఇంకా చెప్పాలంటే నిజ జీవితంలో స్పైలు ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటారా? అనే రేంజ్ లో కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా మంచి రా అండ్ రస్టిక్ గా రావడానికి ప్రధాన కారణం దర్శకుడు ఆదిత్య ధర్ చేసుకున్న క్లీన్ అండ్ ఇంటెన్స్ సెటప్ అనే చెప్పాలి. తన విజన్ చాలా క్లియర్ గా ఉంది. తాను అనుకున్న విజన్ ఆడియెన్ ఏదైతే చూడాలి ఎంతవరకు చూడాలి అనేది సాలిడ్ గా ప్రెజెంట్ చేశారు. పాకిస్తాన్ అండర్ వరల్డ్, గ్యాంగ్ వార్స్, వారు ఎంత క్రూరంగా ఉంటారు అనే ఎలిమెంట్స్ ని చాలా సహజంగా తాను చూపించడం థ్రిల్ చేస్తుంది.

అలాగే ఈ మధ్య కాలంలో రానటువంటి సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ ని కూడా తాను ప్రామిస్ చేశారు. ట్రైలర్ లోనే అవి ఏ రేంజ్ లో ఉన్నాయో చూపించారు కానీ సినిమాలో అంతకు మించే ఉన్నాయి. ఇక ఇవే కాకుండా అన్ని గంటల కథనాన్ని కూడా తాను నీట్ గా హ్యాండిల్ చేయడం బాగుంది. ఎక్కడా పెద్దగా బోర్ లేకుండానే స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకొని ఫస్టాఫ్ ఇంకా సెకండాఫ్ ని బాగా హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఇక దీనితో పాటుగా నటీనటుల ఎంపిక వారికి ఇచ్చిన పాత్రలు ఇంకా అందులో వారి నటన కూడా తాను బాగా రాబట్టుకున్నారు.

అయితే సినిమాలో అంతా బాగానే చేశారు కానీ హీరో రణ్వీర్ సింగ్ ఇంకా నటుడు అక్షయే ఖన్నాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫామెన్స్ లు అందించారని చెప్పాలి. దాదాపు చాలామంది తెలుగు ఆడియెన్స్ కి కూడా వీరు ఎలాంటి నటులు అనేది తెలిసే ఉంటుంది. మరి ఇలాంటి నటులకి సాలిడ్ పెర్ఫామెన్స్ కలిగిన పాత్రలు ఇస్తే ఎలా ఉంటుందో ధురంధర్ చూపిస్తుంది. ఇలా ఇద్దరూ స్క్రీన్ పై కనిపించిన ప్రతీ సారి ఆశ్చర్యపరిచే విధంగా ఆయా సన్నివేశాల్లో తమ ప్యాకెడ్ షో చూపించారు. ఇక వీరితో పాటుగా మాధవన్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించి మంచి నటన అందించారు. అలాగే అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ఇంకా సంజయ్ దత్ లాంటి స్టార్ నటులు కూడా మంచి పెర్ఫామెన్స్ లు అందించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో దాదాపు ఆడియెన్స్ అందరినీ ఎంగేజ్ చేసే ఛాన్స్ ఉంది కానీ ఓ సెక్షన్ ఆఫ్ రెగ్యులర్ ఆడియెన్స్, మెయిన్ గా రన్ టైం లాంటి వాటిని ఆలోచించి సినిమా చూసేవారికి కొన్ని మూమెంట్స్ ఆకట్టుకోకపోవచ్చు.

మెయిన్ గా సెకండాఫ్ లో ఆ పెళ్లి సాంగ్ ఒకటి కట్ చేసి ఉంటే కథనంలో ఇంకొంచెం పలు అయ్యేది. అలాగే ఇది ఓ కొత్తరకంగా స్పై, యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి ఎక్కువగా ఎక్స్ ప్లోర్ చేస్తున్న జానర్ కూడా ఇదే కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా వర్క్ కాకపోవచ్చు. సో ఈ అంశం కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ ని సాలిడ్ గా సెటప్ చేసుకున్నారు. సినిమా విజువల్స్ పరంగా వికాస్ నౌలక్ష మంచి కెమెరా వర్క్ అందించారు. అలాగే మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాలో బిగ్ ప్లస్ అయ్యింది. శశ్వత్ సచ్ దేవ్ ఇచ్చిన స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా సీన్స్ ని ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇచ్చిన స్కోర్ అయితే ఆడియెన్స్ లో మరింత ఊపు తెప్పించేలా మంచి ఎలెక్ట్రిఫైయింగ్ గా అనిపిస్తుంది. శివకుమార్ వి పనికెర్ ఎడిటింగ్ బాగుంది. మూడున్నర గంటల సినిమాకి బాగా కట్ చేశారు. ఇక దర్శకుడు ఆదిత్య ధర్ విషయానికి వస్తే ఆల్రెడీ పైన చెప్పినట్టుగానే సాలిడ్ వర్క్ ఈ సినిమాకి తాను అందించారు. కథ, కథనాలు తాను పక్కాగా ప్లాన్ చేసుకొని అంతసేపు కూడా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ధురంధర్” చిత్రం ఒక గ్రిప్పింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇంత పెద్ద నిడివి అయినప్పటికీ సినిమా ఎంగేజింగ్ గానే సాగింది. అలాగే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చిన రొటీన్ యాక్షన్ ఫ్లిక్ అయితే ఇది కాదు. అలాంటి వాటి నుంచి ఇంకా రా అండ్ రస్టింగ్ స్పై, యాక్షన్ చూడాలి అనుకునేవారికి రణ్వీర్ సింగ్, అక్షయే ఖన్నాలు తమ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ లతో సాలిడ్ ట్రీట్ ఇస్తారు. ఎక్స్ట్రీమ్ వైలెన్స్, చిన్న బోర్ మూమెంట్స్ పక్కన పెడితే ఈ రియలిస్టిక్ స్పై డ్రామా మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు