
కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన వెర్సటైల్ నటుడు ధనుష్ హీరోగా నటించిన పలు ఈ చిత్రాలు ఈ ఏడాదిలో వచ్చాయి. తెలుగు, తమిళ్ సహా హిందీలో తన నుంచి హీరోగా నటించిన సినిమాలు మూడు రాగా వీటిలో తెలుగు నుంచి కుబేర 100 కోట్లకి పైగా రాబట్టి అదరగొట్టింది. ఇక తమిళ్ లో వచ్చిన ఇడ్లీ కడై బిలో యావరేజ్ గా నిలిచిపోయింది కానీ హిందీలో వచ్చిన “తేరే ఇష్క్ మే” సినిమా మాత్రం అదరగొడుతుంది.
హిందీలో సాలిడ్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా ఇపుడు 100 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 118 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ సినిమా అందుకున్నట్టు మేకర్స్ కన్ఫామ్ చేశారు. అయితే మరో ఇండస్ట్రీకి చెందిన హీరోకి బాలీవుడ్ మార్కెట్ కి 100 కోట్ల సినిమా ఉండడం అనేదే చాలా అరుదు అయితే ధనుష్ ఈ ఫీట్ ని రెండు సార్లు చేయడం గమనార్హం. మొదటిగా ఎప్పుడో 2013 లోనే ధనుష్ నటించిన చిత్రం ‘రంజన’ 100 కోట్లకి పైగా రాబట్టింది. ఇప్పుడు తేరే ఇష్క్ మే ఫైనల్ రన్ లో 200 కోట్లు అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

