సూపర్ స్టార్ మహేష్ బాబు, లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వారణాసి’పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే యావత్ ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, సాధారణంగా రాజమౌళి ఒక సినిమాకి 2-3 సంవత్సరాల సమయం తీసుకుంటారు. కానీ, ఈ చిత్ర నిర్మాత కె.ఎల్. నారాయణ చెప్పిన ప్రకారం, ఈసారి రాజమౌళి చాలా వేగంగా పనిచేస్తూ ఈ చిత్రాన్ని 2027లో గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్ర షూట్ మాత్రం ప్రస్తుతం బ్రేక్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి.
మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక మహేష్ బాబు చిన్న గ్యాప్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్‌కి వెళ్లిపోయారు. దీంతో ఈ చిత్రానికి బ్రేక్ పడిందని తెలుస్తోంది. గతంలో మహేష్ పాస్‌పోర్టును జక్కన్న సీజ్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టారు. కానీ, ఇప్పుడు ఆయన కూడా మహేష్ వెకేషన్‌ని ఆపలేకపోయారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.


