సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు అవైటెడ్ సీక్వెల్ చిత్రం జైలర్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా లెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కూడా కమిట్ అయ్యారు. అయితే ఈ సినిమా నుంచి ఊహించని విధంగా దర్శకుడు తప్పుకోవడంతో మేకర్స్ కొత్త దర్శకుడు వేటలో ఉన్నారు కానీ ఇంకో క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది.
దీని ప్రకారం ఈ సినిమా కోసం ఇప్పుడు ట్రెండ్ లో మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఆఫర్ అయితే దానికి మించిన టాస్క్ ఇప్పుడు వరకు రజినీకాంత్ కి అనిరుద్ ఇచ్చిన మాస్ వర్క్ ని తాను మించేలా చేస్తాడా లేదా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. సో దీనిపై ఓ అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.


