ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన రీసెంట్ సెన్సేషనల్ హిట్ చిత్రమే పుష్ప 2 ది రూల్. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా రికార్డులు పాతరేసింది. మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో సినిమాని విడుదల చేయగా పార్ట్ 2 స్టార్ట్ చేయక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వీలయితే అన్ని భాషల్లో రిలీజ్ చేస్తామని బన్నీ తెలిపాడు.
అయితే ఈ సినిమాలో జపాన్ నేపథ్యం కూడా కీలకం అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ జపాన్ రిలీజ్ కి ఈ సినిమా నోచుకోలేదు. కానీ ఫైనల్ గా పార్ట్ 2 రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మేకర్స్ జపాన్ వెర్షన్ ట్రైలర్ ని లాంచ్ చేసి అక్కడి రిలీజ్ డేట్ ని కూడా ఇచ్చారు. అక్కడ ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 16న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
అంతే కాకుండా అక్కడ “పుష్ప కున్రిన్” అనే టైటిల్ పేరిట రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అసలే పుష్ప 2 లో అల్లు అర్జున్ ఎంట్రీనే జపాన్ లో ఉంటుంది. ఇంకా చాలా సీన్స్ మంచి కీలకంగా ఉంటాయి. సో పుష్ప 2 అక్కడ ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి.


