పార్ట్ 3 పూర్తి చేసి పార్ట్ 2 ఎంటరయ్యిన స్టార్ హీరో!

పార్ట్ 3 పూర్తి చేసి పార్ట్ 2 ఎంటరయ్యిన స్టార్ హీరో!

Published on Dec 3, 2025 8:02 AM IST

Drishyam 3 1

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్ సినిమాలు ప్రీక్వెల్ సినిమాల హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలు ఇంకా సెట్స్ మీదకి ఎక్కాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అయితే మలయాళ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన సీక్వెల్ ఫ్రాంచైజ్ లో స్టార్ నటుడు మోహన్ లాల్ నటించిన దృశ్యం కూడా ఒకటి.

దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ కి ఇప్పుడు మూడో భాగం కూడా సైలెంట్ గా పూర్తయ్యింది. ఇక ఈ మూడో పార్ట్ కంప్లీట్ చేసి మోహన్ లాల్ మరో పార్ట్ 2 లోకి ఎంటర్ అయ్యారట. మరి ఆ సినిమానే జైలర్ 2. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. సో ఇలా దృశ్యం 3 పూర్తి చేసుకొని జైలర్ 2లో తన పోర్షన్ కంప్లీట్ చేయడానికి ఎంటర్ అయ్యారట. ఇక ఈ పార్ట్ 2 లో మోహన్ లాల్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు