స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు పలు సినిమాలు అలాగే ఓటిటి ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లోనే ఆమె ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోవడం కూడా జరిగింది. దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకొని తన జీవితంలో కొత్త చాప్టర్ ని మొదలు పెట్టింది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఒక ఊహించని ట్విస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది. నిన్న సమంత షేర్ చేసిన ఫొటోస్ లో ఒక ఫొటోలో ఆమె చేతికి ఓ ఉంగరం కనిపిస్తుంది.
కానీ సరిగ్గా అదే ఉంగరం దాదాపు 10 నెలల కితం ఓ పోస్ట్ లో ఆమె చేతికి కనిపించింది. అంటే అదే ఉంగరంతో 10 నెలల కితమే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యిందా లేదా రాజ్ ఆమెకి బహుమానంగా ఇచ్చినా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే అప్పటి ఉంగరాన్నే మళ్ళీ పెళ్ళికి పెట్టుకుంది అంటే దాదాపు అదే తమ ఎంగేజ్మెంట్ ఉంగరం అని సో ఇద్దరూ ఒకటవుదామని అనుకున్నది రీసెంట్ గా తీసుకున్న డెసిషన్ అయితే కాదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
View this post on Instagram
View this post on Instagram


