ట్రైలర్ టాక్: ఇంటెన్స్ అండ్ ఎమోషన్స్ తో రోషన్ కనకాల, బండి సరోజ్ ల ‘మోగ్లీ’

ట్రైలర్ టాక్: ఇంటెన్స్ అండ్ ఎమోషన్స్ తో రోషన్ కనకాల, బండి సరోజ్ ల ‘మోగ్లీ’

Published on Dec 2, 2025 11:59 AM IST

Mowgli

మన తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ అలాగే పాపులర్ నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల మన తెలుగు దగ్గర ఒక డీసెంట్ డెబ్యూని అందించిన సంగతి తెలిసిందే. ఇక తన నెక్స్ట్ సినిమాగా ‘మోగ్లీ 2025’ తో తాను ఇప్పుడు రాబోతున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఒక ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ ట్రైలర్ కట్ ని ఇప్పుడు వదిలారని చెప్పాలి.

ఈ ట్రైలర్ లో హీరో హీరోయిన్ నడుమ ప్రేమ కథ మంచి సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ గా కనిపిస్తుండగా ఇలాంటి స్టోరీ మధ్యలో ఎంటర్ అయ్యిన పోలీస్ ఆఫీసర్ గా బండి సరోజ్ కుమార్ ట్రాక్ నుంచి మంచి ఇంటెన్స్ గా కనిపిస్తుంది. అలాగే సినిమా కోసం మేకర్స్ ఆ అడవుల్లో చాలానే కష్టపడినట్టు కనిపిస్తుంది.

అలాగే రోషన్ కూడా చాలా ఈజ్ గా మంచి ఎమోషన్స్ తో కూడిన సాలిడ్ పెర్ఫామెన్స్ ని చేసినట్టు అర్ధం అవుతుంది. అలాగే ట్రైలర్ స్కోర్ కానీ, కెమెరా వర్క్ లు కూడా బాగున్నాయి. ఇక ఈ డిసెంబర్ 12న వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు