సర్ప్రైజ్: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రష్మిక హిందీ సినిమా.. చిన్న ట్విస్ట్ ఏంటంటే

సర్ప్రైజ్: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రష్మిక హిందీ సినిమా.. చిన్న ట్విస్ట్ ఏంటంటే

Published on Dec 2, 2025 9:00 AM IST
Rashmika Mandanna's Thamma on OTT

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మెయిన్ లీడ్ లో నటించిన చిత్రాలు ఈ ఏడాదిలో అందులోని ఈ ఏడాది చివర లోనే రెండు వచ్చాయి. మరి వాటిలో తన బాలీవుడ్ చిత్రం “థామ్మా” కూడా ఒకటి. బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా 200 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా సర్ప్రైజింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాని వారు నేటి నుంచి తీసుకొచ్చారు. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే పప్రస్తుతం ఈ సినిమా కేవలం రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఉంది. సో 350 చెల్లించి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. అలాగే ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాని ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కించగా నోరా ఫతేహి ఆయుష్మాన్ కురానా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు