ఇంటర్వ్యూ : నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట – ‘అఖండ 2’తో గూస్‌బంప్స్ గ్యారెంటీ!

ఇంటర్వ్యూ : నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట – ‘అఖండ 2’తో గూస్‌బంప్స్ గ్యారెంటీ!

Published on Dec 1, 2025 9:00 PM IST

Raam Achanta Gopi Achanta

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్.థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

అఖండ 2 ప్రాజెక్టు ఎలా మొదలైంది?

లెజెండ్ సినిమా మేమే చేసాము. 2014 ఎలక్షన్స్ కి ముందు ఆ సినిమా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. అదే కాంబినేషన్లో మళ్లీ ఈ ఎలక్షన్స్ కి ముందు ఒక సినిమా చేయాలనుకున్నాం. మేము అనుకున్న కథ సరిగ్గా ఎలక్షన్స్ ముందే రావాలి. అప్పుడే ఆ క్యారెక్టర్, కథ కనెక్ట్ అవుతుంది. సరిగ్గా ఎలక్షన్ డేట్ అనేది ఒక క్లారిటీ లేకపోవడంతో ఆ కథని పక్కనపెట్టి అఖండ2 కథని ముందుకు తీసుకెళ్లాం.

ఈ సినిమాని చాలా డిఫరెంట్ లొకేషన్స్ లో సూట్ చేశారు కదా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
ఈ సినిమాని కుంభమేళాలో షూట్ చేసాం. అక్కడ షూట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి. మాకు అన్ని పర్మిషన్లు దొరికాయి. డ్రోన్ పర్మిషన్ కూడా దొరికింది. ఇప్పుడు మీరు సినిమాలో చూడబోయే ప్రతి సన్నివేశం ఈ సినిమా కోసం తీసిందే.

సంయుక్త, పూర్ణ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?

సంయుక్త గారిది హీరోయిన్ క్యారెక్టర్ లా కాకుండా ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్రలానే వుంటుంది. అఖండ లో ఉన్న పూర్ణ గారు ఇందులో కూడా కంటిన్యూ అవుతారు.

బోయపాటి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

బోయపాటి గారిలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఆయన ఏది చెప్పినా వింటారు. ఆ కథకి ప్రాజెక్టుకి అవసరమైన సూచన సలహా అయితే వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెడతారు.

తమన్ గారి మ్యూజిక్ గురించి?

ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జ్యూక్ బాక్స్ ని కూడా రిలీజ్ చేశాం. ఇంకాస్త ముందుగా రిలీజ్ చేస్తే బావుండేదని ఆడియన్స్ చెప్తున్నారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలు కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోరు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అఖండ3 చేసే అవకాశం ఉందా?

ఈ యూనివర్స్ లో మరో సినిమా చేసే స్కోప్ అయితే ఉంది. అది లిమిట్ లెస్. బాలయ్య గారు బోయపాటి గారు అనుకుంటే ఏదైనా అవ్వచ్చు. ఇందులో మేము మొదలు పెట్టిన కథ అయితే సంపూర్ణంగా పూర్తవుతుంది.

ఈ చిత్రాన్ని ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు?

అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే హిందీలో చేస్తున్నాం. ఇది కాకుండా బీహార్ లో అవధి అనే ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నాం.

కొత్తగా చేయబోతున్న సినిమాలు?

కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులతో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అలాగే ఒక పెద్ద సినిమా ప్రాసెస్ లో ఉంది. త్వరలోనే దాని గురించి చెప్తాం.

తాజా వార్తలు