మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ నే మన శంకర వరప్రసాద్ గారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ మీసాల పిల్ల సూపర్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ సాంగ్ పై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సాంగ్ ని త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు.
అయితే దీనిపైనే ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం నెక్స్ట్ సాంగ్ గా మరో రొమాంటిక్ డ్యూయెట్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారట. వెంకీ మామ, చిరు లపై సాంగ్ కూడా అన్నారు కానీ మళ్ళీ నయన్, చిరులపై సాంగ్ నే వదులుతారట. ఈ సాంగ్ ‘శశిరేఖ’ అంటూ సాగుతుందట. మరి ఈసారి భీమ్స్ ఎలాంటి ట్యూన్ అందించాడో చూడాలి మరి. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కి తీసుకొస్తున్నారు.


