‘కూలీ’ స్ట్రాటజీతో ‘అఖండ 2’.. తెలుగులో ఇదే మొదటిసారి!

‘కూలీ’ స్ట్రాటజీతో ‘అఖండ 2’.. తెలుగులో ఇదే మొదటిసారి!

Published on Nov 30, 2025 11:00 PM IST

akhada2 coolie
ఇప్పుడు ఓ సినిమా జనంలోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. కానీ ఆ ప్రమోషన్స్ కూడా ఎంత వినూత్నంగా ఉంటే అంతే రీతిలో ఆడియెన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మరి లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాకి చేసిన ఓ వినూత్న ప్రమోషన్స్ అందరికీ ఒకింత ఆశ్చర్యపరిచింది. కూలీ సినిమా కోసం మేకర్స్ అమెజాన్ తో టైఅప్ అయ్యి డెలివరీ పార్శిల్స్ పై కూలీ పోస్టర్స్ ప్రింట్ చేసి డెలివరీలు రిలీజ్ కి ముందు చేశారు.

మరి లేటెస్ట్ గా ఇదే స్ట్రాటజీని నట సింహం బాలయ్య నటించిన సినిమా ‘అఖండ 2 తాండవం’ కూడా ఫాలో అవుతున్నారట. ఆల్రెడీ అఖండ 2 పోస్టర్స్ కలిగిన డెలివరీ పార్శిల్స్ వస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. దీనితో మన తెలుగులో ఇదే ఓ సినిమాకి ఫస్ట్ ఎవర్ ప్రమోషన్ గా నిలిచింది. మొత్తానికి అఖండ 2 టీం కూడా సాలిడ్ ప్రమోషన్స్ ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

ahd

సంబంధిత సమాచారం

తాజా వార్తలు