ముగ్గురు టాప్ స్టార్స్ కి కథ చెప్పిన లోకి!? ఎవరు ఓకే చెప్పినా బ్లాస్టే

ముగ్గురు టాప్ స్టార్స్ కి కథ చెప్పిన లోకి!? ఎవరు ఓకే చెప్పినా బ్లాస్టే

Published on Nov 30, 2025 9:03 PM IST

Lokesh Kanagaraj

కోలీవుడ్ సినిమా స్టార్ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. తన గత రెండు సినిమాలు అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోకపోయినప్పటికీ ఈ సినిమాలు తర్వాత తన నుంచి నెక్స్ట్ ఏ టాప్ స్టార్ తో సినిమా చేయాలని అనుకున్నా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది. నిజానికి లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు కానీ లోకేష్ ప్లానింగ్ మాత్రం మరోలా ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇలా తాను ముగ్గురు బిగ్ స్టార్స్ కి మన సౌత్ నుంచి కథలు చెప్పినట్టు టాక్. ఇప్పటి వరకు తాను వర్క్ చేయని కంప్లీట్ కొత్త స్టార్స్ తో కి తాను స్క్రిప్ట్స్ రెడీ చేసి చెప్పాడట. ఇలా తెలుగు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే తమిళ్ లో అజిత్ కుమార్ లకి తాను నరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురులో ఎవరూ ఇంకా లోకేష్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్టే టాక్. కానీ ఇచ్చేలా ఉంటే మాత్రం ఎవరితో చేసినా కూడా బాక్సాఫీస్ బ్లాస్టే అని చెప్పాల్సిందే. మరి ఈ ముగ్గురులో ఎవరు లోకేష్ ని ఓకే చేస్తున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు