మన టాలీవుడ్ సినిమా దగ్గర జీరో కాంట్రవర్సీలు కలిగిన సీనియర్ టాప్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. ఈ ఏడాదిలో తెలుగు సినిమాకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి భారీ లాభాలు అందించి ఫ్యామిలీ ఆడియెన్స్ తనని మించి స్టార్ లేరని రీజన్ ఇండస్ట్రీ హిట్ తో సమాధానం అందించారు.
ఇక అలాంటి హీరోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడైతే ఎలా ఉంటుందో ఇంకొన్నాళ్లలో చూపించనున్నారు. దర్శకత్వం వహించకపోయినప్పటికీ వెంకీమామ సినిమాలకి త్రివిక్రమ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ గా త్రివిక్రమ్ వెంకీ మామని దర్శకత్వం వహిస్తున్నారు.
మరి ఫైనల్ గా ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి క్లీన్ ఫ్యామిలీ టైటిల్ ని లాక్ చేసినట్టు వినిపిస్తుంది. ఈ బజ్ ప్రకారం త్రివిక్రమ్ ‘బంధు మిత్రులకి అభినందనలతో’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. దీనితో కేవలం టైటిల్ తో తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్ ని తమ సినిమా వైపు తిరిగి చూసేలా చేసారని చెప్పవచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.


