ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మాంచి హైప్ నడుమ రాబోతున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన ఈ సాలిడ్ యాక్షన్ కం డివోషనల్ సినిమా కోసం ప్రపంచ వ్యాప్త తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ఇప్పుడు తెలుస్తుంది. జర్మనీకి చెందిన ఓ వీరాభిమాని అఖండ 2 టికెట్ ని అక్షరాలా 2 లక్షలు పెట్టి కొన్నాడట.
మరి ఈ సినిమా కోసం తాను ఎలా వేచి చూస్తున్నారో బాలయ్య అంటే ఎంత ప్రేమో దీని బట్టి అర్ధం అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి టార్గెట్ తోనే ఈ సినిమా దిగబోతుంది. మరి ఆ అంచనాలు సినిమా రీచ్ అవుతుందా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


