ఆంధ్ర కింగ్ తాలూకా : ఈ లాజిక్ గమనించారా..?

ఆంధ్ర కింగ్ తాలూకా : ఈ లాజిక్ గమనించారా..?

Published on Nov 28, 2025 7:01 PM IST

Andhra King Thaluka

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేయగా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సక్సె్స్ మీట్ నిర్వహించారు మేకర్స్.

అయితే, ఈ సందర్భంగా ఓ విలేకరి సినిమాకు సంబంధించి ఓ లాజిక్ ప్రశ్న అడిగారు. ఈ సినిమాలో ఉపేంద్ర 100 సినిమాలు చేసిన హీరోగా కనిపిస్తారు. అయిన దగ్గర రూ.3 కోట్లు ఉండవా..? అని ప్రశ్నించారు. దీనికి దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమా పీరియాడికల్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఆ సమయంలో రూ.3 కోట్లు అంటే ఎక్కువ అని తెలిపారు. కాగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. గతంలో ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ సినిమాలు ప్రొడ్యూస్ చేసి నష్టపోయారు. ఇందులోనూ హీరో 100 చిత్రాల్లో 25 చిత్రాలు ప్రొడ్యూస్ చేసి నష్టపోయినట్లు తెలిపారు.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, ఈ ప్రెస్ మీట్‌లో వచ్చిన ప్రశ్నపై ఇప్పుడు చర్చించుకుంటున్నారు. నిజంగా 100 సినిమాలు తీసిన హీరో దగ్గర రూ.3 కోట్లు ఉండవా..? అంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు