సమీక్ష : ఆంధ్రా కింగ్ తాలూకా – ఆకట్టుకునే ఓ అభిమాని కథ !

సమీక్ష : ఆంధ్రా కింగ్ తాలూకా – ఆకట్టుకునే ఓ అభిమాని కథ !

Published on Nov 27, 2025 4:36 PM IST

Andhra King Taluka

విడుదల తేదీ : నవంబర్ 27, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల, తులసి, సింధు టోలాని, సత్య, విటీవీ గణేష్ తదితరులు
దర్శకుడు : మహేష్ బాబు పి
నిర్మాతలు : నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్
సంగీత దర్శకుడు : వివేక్–మెర్విన్
సినిమాటోగ్రాఫర్ : సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

రాజమండ్రి ప్రాంతంలోని ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ (రామ్ పోతినేని)కి తన చిన్నతనం నుంచే ‘ఆంధ్ర కింగ్’ సూర్య (ఉపేంద్ర) అంటే ప్రాణం. ఆయన సినిమాలకు బ్యానర్లు కట్టి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కూడా సాగర్ ఉంటాడు. ఇలాంటి సాగర్, మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే)ని చూసి ప్రేమలో పడతాడు. ఐతే, ఆమె తండ్రి (ముర‌ళీ శ‌ర్మ‌) సాగర్ స్థాయి, నేపథ్యాన్ని చూసి చుల‌క‌న‌ చేస్తాడు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సాగర్, తన ప్రేమ కోసం తన లంక గ్రామంలోనే పెద్ద థియేటర్ కట్టి, మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అని ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి ?, సాగర్ జీవితంలో చోటు చేసుకున్న మలుపులు ఏమిటి ?, తన అభిమాన హీరో ‘సూర్య’ కోసం సాగర్ ఏం చేశాడు ?, చివరికి మహాలక్ష్మితో సాగర్ ప్రేమ స‌క్సెస్ అయిందా ?, లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో రామ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. కామెడీ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని స్టెప్స్ తోనూ రామ్ సినిమాకే హైలైట్ గా నిలిచాడు. భాగ్యశ్రీ బోర్సే తో సాగిన లవ్ స్టోరీలోనూ రామ్ తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన ఉపేంద్ర మెప్పించాడు. ఉపేంద్ర – రామ్ మధ్య వచ్చే సన్నివేశం బాగుంది. ఇక తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ కూడా బాగా నటించాడు. మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ, తులసి, సింధు టోలాని, సత్య, విటీవీ గణేష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

దర్శకుడు మహేష్ బాబు.పి రాసుకున్న మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అండ్ కొన్ని ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కి ఫ్యాన్స్ కి మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంది. అలాగే, రామ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

రామ్ పోషించిన సాగర్ పాత్రను, ఆ పాత్ర తాలూకు హీరో సెంటిమెంట్ ను బాగా డిజైన్ చేసుకున్న మహేష్ బాబు.పి, కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈ ‘ ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో -హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి చూపించి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.

అయితే, రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా చాలా కలర్ ఫుల్ గా మేకింగ్ చేసిన దర్శకుడు మహేష్ బాబు, స్క్రీన్ ప్లేను మాత్రం కొన్ని చోట్ల స్లోగా నడిపాడు. కాకపోతే సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి.

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు మహేష్ బాబు కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకులు
అందించిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘ ఆంధ్రా కింగ్ తాలూకా’ అంటూ వచ్చిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. రామ్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు అభిమాన హీరో పై ఉండే అభిమానం, అలాగే రామ్ పాత్ర తాలూకు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో రామ్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు