నిర్మాతగా నా స్థాయిని పెంచే సినిమా ‘మఫ్టీ పోలీస్’ – ఏ.ఎన్. బాలాజీ

నిర్మాతగా నా స్థాయిని పెంచే సినిమా ‘మఫ్టీ పోలీస్’ – ఏ.ఎన్. బాలాజీ

Published on Nov 20, 2025 7:05 AM IST

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మఫ్టీ పోలీస్’. తమిళంలో ‘తీయవర్ కులై నడుంగ’ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని, శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా ప్రముఖ నిర్మాత ఏ.ఎన్. బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న (రేపు) ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిస్ట్రిబ్యూటర్‌గా వందల చిత్రాలను పంపిణీ చేసి, నిర్మాతగా ‘రంగం-2’, ‘యుద్ధభూమి’, ‘ఒరేయ్ బామ్మర్ది’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన బాలాజీ, ‘మఫ్టీ పోలీస్’ నిర్మాతగా తన స్థాయిని మరింత పెంచుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఒక రచయిత హత్య నేపధ్యంలో సాగే ఈ కథలో యాక్షన్‌తో పాటు ఆటిజం వ్యాధిపై అవగాహన కల్పించే సందేశం కూడా ఉందని ఆయన తెలిపారు.

అర్జున్, ఐశ్వర్య రాజేష్‌లకు తెలుగులో ఉన్న ఆదరణ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు బాలాజీ పేర్కొన్నారు. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. అరుల్ కుమార్ నిర్మించగా, శరవణన్ అభిమన్యు సంగీతం అందించారు.

తాజా వార్తలు