హీరో నితిన్ ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. భారీ బడ్జెట్‌తో వచ్చిన రాబిన్‌హుడ్ మరియు తమ్ముడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో ఆయన కెరీర్‌కు గట్టి దెబ్బ తగిలింది. ప్రస్తుతం తాత్కాలిక విరామం తీసుకున్న ఆయన, కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. రాబోయే సినిమాలు షెల్ఫ్‌లో పడ్డాయన్న వార్తలపై స్పందించకుండా, తిరిగి నిలబడేందుకు ప్లాన్‌పై దృష్టి పెట్టారు.
నితిన్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇష్క్’ చిత్రం కాంబో మరోసారి సెట్ అయింది. దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా చేసేందుకు నితిన్ రెడీ అయ్యాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఇక ఈ సినిమాకు కూడా అనూప్ రూబెన్స్ సంగీతం, బీజీఎం అందించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.


