సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా అలానే పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇంకా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “వారణాసి” కోసం ఇప్పుడు ప్రపంచ సినిమానే మాట్లాడుతుంది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఈ ఫ్యాన్స్ కి జక్కన్న ఇచ్చిన సెన్సేషనల్ సర్ప్రైజ్ ఓ రేంజ్ లో ట్రీట్ ఇచ్చింది. అయితే ఇందులో జక్కన్న చాలా మైక్రో డీటెయిల్స్ వదిలారు.
మరి వాటిని అభిమానులు కూడా కొంతమేర కనిపెట్టారు. అయితే వాటితో పాటుగా మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. దాదాపు ప్రతీ ఫ్రేమ్, కొన్ని నిమిషాల సెకండ్స్ దగ్గర అవి బాగా గమనిస్తే కనిపిస్తాయి. 44 వ సెకండ్ దగ్గరే ఆకాశం నుంచి ఓ ఉల్క అంటార్కికా మంచు ప్రదేశంలో పడినప్పుడు దాని వెనుక ఉన్న పర్వతంపై కొందరు కింద నీటిపై చిన్న బోట్ పై ఇంకొందరు కనిపిస్తున్నారు.
అంటే ఆ పర్వతంలో ఏదైనా దాగి ఉంటే దాన్ని వెలికి తీసేందుకు పని చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇక ఆ నెక్స్ట్ కట్ ఒక నిమిషం ఒక సెకండ్ దగ్గర మంచులో ఇరుక్కుపోయిన రెండు ముక్కల పడవ కనిపిస్తుంది. ఆ తర్వాత ప్యారాచూట్ లో ఎగురుతూ వస్తున్న షాట్ ఈజీగా కనిపెట్టే విధంగానే ఉంది. కానీ ఆ తర్వాత ఒక నిమిషం 14 వ సెకను నుంచి నీటిలో నీటి ఏనుగుల సముదాయంకి కొంచెం దూరపు ఒడ్డున కొందరు చేపలు పడుతున్నట్టు కనిపిస్తుంది.
అలా ఉగ్రబట్టి గుహలో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సన్నివేశానికి లింక్ కనిపిస్తుంది. ఇంకా గమనిస్తే ఆ కింద అంతా కొందరు గన్స్ పట్టుకొని పైన ఒక దగ్గర ఓ వ్యక్తి కొండ చరియ అంచున కనిపిస్తున్నాడు. అది మహేష్ బాబే అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ హీరోయిన్ ని కాపాడే సన్నివేశం అయితే ఇద్దరికీ చాలా దూరం కనిపిస్తుంది. సో దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదే సీన్ లో కింద గమనిస్తే ఒక ముని హోమం ముందు యాగం చేస్తున్నాడు, తన పక్కన కపాలాలు లాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ లంకా నగరానికి చేరుకున్న విజువల్స్ లో హనుమంతుని తోకపై గుర్రపు బండి దాని వెనుక మరొకరు కనిపిస్తున్నారు. అలాగే ఆంజనేయుడు చేతిలో ఏకంగా పెద్ద వృక్షాన్నే పట్టుకొని యుద్ధం చేస్తున్నారు. అలాగే వానర సైన్యంతో రామునిపై చూపించిన సన్నివేశం చూస్తే కొంచెం ఎడమ వైపు వెనుక భాగంలో పర్వతాలు అన్నీ ఒకే ఆకారంలో కనిపిస్తున్నాయి.
ఇక అక్కడే రామ బాణం నుంచి నీలి రంగు విజువల్ తో ఒక ట్రాన్సిక్షన్ మళ్ళీ ప్రస్తుతానికి వారణాసికి షిఫ్ట్ అయ్యింది. అయితే ఈ మెరుపుని గమనిస్తే నీటి సుడిగుండంకి పైగా కొన్ని చక్రాలు లాంటివి తిరుగుతూ కనిపిస్తున్నాయి. బహుశా ఇదే టైం ట్రావెల్ పోర్టల్ కూడా కావచ్చు. ఇలా మొత్తానికి చాలానే ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ పరిచయ గ్లింప్స్ లో కనిపిస్తున్నాయి. మరి జక్కన్న ఎలాంటి సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు అనేది వీచి చూడాలి.


