అఖండ 2 తాండవాన్ని అక్కడ చూపెట్టేది వీరే..!

అఖండ 2 తాండవాన్ని అక్కడ చూపెట్టేది వీరే..!

Published on Nov 15, 2025 8:00 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2 తాండవం’ ఇప్పటికే ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ‘అఖండ 2’ చిత్రాన్ని ఉత్తరాదిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమాక నార్త్ బెల్ట్‌లో కూడా భారీ రిలీజ్ ఉండబోతుందని స్పష్టమైంది.

ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

తాజా వార్తలు