గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ : సముద్రాలు దాటి వస్తున్న అభిమానం..!

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ : సముద్రాలు దాటి వస్తున్న అభిమానం..!

Published on Nov 15, 2025 6:02 PM IST

SSMB29

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ మరికొద్దిసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. అయితే, ఈ ఈవెంట్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుతున్నారు. ఈ ఈవెంట్ కోసం విదేశాల నుండి కూడా అభిమానులు వస్తుండటం విశేషం.

ఆస్ట్రేలియా పెర్త్‌కి చెందిన సునీల్ అవుల అనే ఓ అభిమాని ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం 12 గంటల ప్రయాణం చేసి హైదరాబాద్‌కి చేరుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన డెడికేషన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోగా, ఎస్ఎస్.కార్తికేయ కూడా స్పందించారు.

టైటిల్ రివీల్ ఈవెంట్ కోసం ఇంత దూరం నుంచి అభిమాని రావడం అరుదైన సంఘటన. మహేష్ బాబుపై అభిమానుల ప్రేమ, ఈ సినిమా కోసం ఉన్న ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో ఇది స్పష్టం చేస్తోంది. ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో మహేష్ బాబుని రాజమౌళి ఎలా చూపెట్టబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు