గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ అవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానుంది.
ఇక ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తోంది. సీనియర్ నటి శోభన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాతీయ అవార్డు అందుకున్న శోభన ఇటీవల తెలుగులో చాలా సెలెక్టివ్ పాత్రలు చేస్తున్నారు. కాగా, పెద్ది సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బుచ్చిబాబు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించగా, ఇప్పుడు ఆయన తనయుడు రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేయబోతుందనే వార్తతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.


