బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర డియోల్ షాకింగ్ న్యూస్ పై క్లారిటీ!

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర డియోల్ షాకింగ్ న్యూస్ పై క్లారిటీ!

Published on Nov 11, 2025 9:52 AM IST

బాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి దిగ్గజ స్టార్ నటుల్లో వెర్సటైల్ నటుడు ధర్మేంద్ర డియోల్ కూడా ఒకరు. ఇండియన్ సినిమాకి ఎన్నో ఐకానిక్ చిత్రాలు ఐకానిక్ పాత్రలు చేసిన తాను ఇపుడు తన 89 వ ఏట తుది శ్వాస విడిచారు అనే వార్తలతో బాలీవుడ్ సినిమా సహా తెలుగు సినిమా ప్రముఖులు ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అయితే చాలా వేగంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యిపోయిన ఈ వార్తలు విని దేశ వ్యాప్తంగా అంతా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు కానీ అసలు దీనిపై మెయిన్ క్లారిటీ బయటకి వచ్చింది. స్వయంగా ధర్మేంద్ర డియోల్ కూతురు ఈశా డియోల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలు తిప్పి కొట్టారు. తన తండ్రిపై ప్రచారం అవుతున్న వార్తలు అబద్దం అని వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది తాను నెమ్మదిగా కోలుకుంటున్నారు అని అసలు క్లారిటీ ఇచ్చారు. సో ఆ వార్తలు అన్నీ అబద్దం అని ఇపుడు తేలింది.

తాజా వార్తలు