క్రేజీ: సచిన్ ని డైరెక్ట్ చేసిన ‘ఓజి’ దర్శకుడు!

క్రేజీ: సచిన్ ని డైరెక్ట్ చేసిన ‘ఓజి’ దర్శకుడు!

Published on Nov 7, 2025 3:29 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ వసూళ్లు అందుకున్న దర్శకుడు సుజీత్ కూడా ఒకరు. సుజీత్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే “ఓజి”. పవర్ స్టార్ ని ఓ రేంజ్ లో డైరెక్ట్ చేసిన సుజీత్ ఇప్పుడు లేటెస్ట్ గా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ని డైరెక్ట్ చేయడం జరిగింది.

అయితే ఇది ఓ సినిమా కోసం కాదు యాడ్ షూట్ లో భాగంగా సచిన్ సుజీత్ దర్శకత్వంలో నటించడం జరిగింది. దీనితో ఈ షూట్ తాలూకా క్రేజీ క్లిక్స్ ని సుజీత్ తన సోషల్ మీడియాలో పంచుకోగా ఇవి చూసిన ఫాలోవర్స్ మంచి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక సుజీత్ వీటితో పాటుగా నాచురల్ స్టార్ నానితో ఓ సాలిడ్ యాక్షన్ సినిమా చేస్తుండగా ఈ సినిమా పనులు కూడా శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయి.

తాజా వార్తలు