SSMB29 నుంచి పృథ్వీరాజ్ పై షాకింగ్ లుక్ రివీల్ చేసిన రాజమౌళి!

SSMB29 నుంచి పృథ్వీరాజ్ పై షాకింగ్ లుక్ రివీల్ చేసిన రాజమౌళి!

Published on Nov 7, 2025 12:30 PM IST

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి నెక్స్ట్ బిగ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనే చెప్పాలి. గ్లోబల్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసిన ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ 15న జరగనున్న భారీ ఈవెంట్ కి ముందు కొన్ని సర్ప్రైజ్ లు ఉన్నట్టుగా దర్శకుడు రాజమౌళి తెలిపారు.

అలాగే నేడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ కూడా ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు ఆ లుక్ పోస్టర్ తో షాకిచ్చారు. అని చెప్పాలి. పృథ్వీ రాజ్ ని ‘కుంభ’ గా పరిచయం చేస్తూ తన యునిక్ రోల్ ని రివీల్ చేసేసారు. ఒక వీల్ చైర్ లో పృథ్వీరాజ్ అంగ వైకల్యంతో కనిపిస్తుండగా అదే సమయంలో తన చైర్ వెనుక ఉన్న రోబోటిక్ చేతులు చూస్తుంటే పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి మాత్రం రాజమౌళి ఒక ఊహించని ట్రీట్ నే బిగ్ స్టార్స్ తో ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ రానున్న అప్డేట్ పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు